Telugu Gateway
Cinema

రవితేజ ‘క్రాక్’ ప్రారంభం

రవితేజ ‘క్రాక్’ ప్రారంభం
X

రవితేజ, శృతిహాసన్ జంటగా నటించనున్న సినిమా టైటిల్ పేరు ఫిక్స్ అయింది. అదే ‘క్రాక్’. ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా గురువారం నాడు హైదరాబాద్ లో ప్రారంభం అయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుంటే..ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కన్పించనున్నారు.

తమిళ నటుడు సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం జోష్ లో ఉన్న తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ సినిమాలో నటిస్తున్నారు. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it