Telugu Gateway
Cinema

ఆర్ఆర్ఆర్..ఇది పాటల టైమ్!

ఆర్ఆర్ఆర్..ఇది పాటల టైమ్!
X

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఈ వర్కింగ్ టైటిల్ తోనే సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఎన్టీఆర్ జోడీగా విదేశీ భామ ఒలివా మోరిస్ ను ఎంపిక చేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక పూర్తయింది. సినిమా ఇప్పటికే 70 శాతం మేర పూర్తయిందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

అదే సమయంలో ఇప్పుడు పాటల పని మొదలైనట్లు సమాచారం. ముందుకు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్, అలియా భట్ లతో ఈ పాటను తెరకెక్కించనున్నారు. ఈ డ్యూయెట్ కోసం భారీ ఎత్తున ఓ సెట్ వేసినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలైలో పది భాషల్లో విడుదల కానుంది.

Next Story
Share it