Telugu Gateway
Andhra Pradesh

పోలవరం పనులు ప్రారంభం

పోలవరం పనులు ప్రారంభం
X

ఏపీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన పోలవరం పనులను శుక్రవారం నాడు మెఘా సంస్థ శ్రీకారం చుట్టింది. రివర్స్ టెండరింగ్ మోడల్ లో ఈ సంస్థ పనులనను దక్కించుకున్న విషయం తెలిసిందే. గురువారం నాడు హైకోర్టు ఈ పనులపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వటంతో ఏపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే మెఘా ఇంజనీరింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ శుక్రవారం ప్రాజెక్టు సైట్ లో పూజ చేసి లాంఛనంగా పనులు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సాగునీటి శాఖ అధికారులు పేర్కొన్నారు. పోలవరం అంశంపై శుక్రవారం నాడు అమరావతిలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. అనుకున్న సమయానికల్లా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని అన్నారు. నవంబర్ 1 తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పినట్లుగానే శుక్రవారం నుంచి పోలవరం పనులు మొదలు అయ్యాయని వెల్లడించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని... తమ ప్రభుత్వ సంకల్పం మంచిది కాబట్టే తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువడిందన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వ ఖజానాకు రూ. 800 కోట్లు మిగిలాయని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత తీర్పు నేపథ్యంలో టీడీపీ నేతలు కోర్టును కూడా తప్పుపడతారేమోనంటూ ఎద్దేవా చేశారు. ‘70 శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశామని చంద్రబాబు అబద్దాలు చెపుతున్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని దేవినేని ఉమా సవాల్ చేశారు. మాట తప్పడం అనేది చంద్రబాబుకు అలవాటు. తమ వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం.. వారి దగ్గర నుంచి కమీషన్లు తీసుకోవడం చేశారు. ఇప్పుడు పోలవరం సబ్ కాంట్రాక్టర్లుకు సమస్యలు ఏమైనా ఉంటే వాళ్లు నవయుగతో తేల్చుకుంటారు అని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబులా మాట తప్పే నైజం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని.. అనుకున్న సమయానికల్లా ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు.

Next Story
Share it