Telugu Gateway
Andhra Pradesh

సోమవారం జీవో..మంగళవారం రద్దు

సోమవారం జీవో..మంగళవారం రద్దు
X

ఏపీలో వైసీపీ సర్కారు నిర్ణయాలు తీవ్ర వివాదస్పదం అవుతున్నాయి. సోమవారం నాడు పాఠశాల విద్యా శాఖ ప్రతిభా పురస్కారాలకు సంబంధించి గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ఉండగా వాటిని దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలుగా మార్చింది. ఈ అంశం ఏపీలో పెద్ద దుమారమే రేపింది. రాజకీయంగా కూడా విమర్శలు చెలరేగాయి. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన దృష్టికి తీసుకురాకుండా అసలు ఈ జీవో ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సోమవారం నాడు జారీ చేసిన జీవోను మంగళవారం నాడు రద్దు చేశారు. అయినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యకత్ అవుతోంది. జాతీయా మీడియాలోనూ దీనికి సంబంధించిన వార్తలు వెలువడ్డాయి.

Next Story
Share it