Telugu Gateway
Politics

ఎంఐఎంపై మమతా సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎంపై మమతా సంచలన వ్యాఖ్యలు
X

దేశంలోని పలు రాష్ట్రాల ఎన్నికల బరిలో నిలుస్తున్న ఎంఐఎం ఈ సారి తన దృష్టి పశ్చిమ బెంగాల్ పై పెట్టింది. ఎంఐఎం పోటీ చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను చావు దెబ్బ తీసిందనే రాజకీయ విశ్లేషణలు వెల్లడయ్యాయి. ఆ పార్టీ సొంతంగా సీట్లు గెలిచినా గెలవకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కు మాత్రం భారీ నష్టం చేకూరుతోంది. ఇది అటు ఇటు తిరిగి బిజెపికి పలు చోట్ల ప్రయోజనకరంగా మారింది. ప్రధాన కారణం మైనారిటీలు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనే విషయం తెలిసిందే. ఎంఐఎం రంగంలో నిలుస్తుండటంతో కాంగ్రెస్ కు పడాల్సిన ఆ ఓట్లు చీలి అంతిమంగా బిజెపి లాభపడుతోంది. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంఐఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపికి అమ్ముడుపోయి ఎంఐఎం పార్టీ పశ్చిమ బెంగాల్ లో పోటీకి సన్నాహాలు చేస్తోందని ఆమె ఆరోపించారు.

బెంగాల్ లోని ముస్లింలు మజ్లిస్ మాటలు నమ్మవద్దని ఆమె కోరారు బెంగాల్ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయాలని మజ్లిస్ బావిస్తున్న నేపద్యంలో టి.ఎమ్.సి.అదినేత అయిన ముఖ్యమంత్రి మమత ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. పలు రాష్ట్రాలలో కూడా మజ్లిస్ పార్టీ పోటీచేసి బిజెపికి ఉపయోగపడేలా వ్యవహరిస్తోందని ఆమె చెప్పారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించటం విశేషం. ఈ సారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో పాగా వేయాలని బిజెపి తీవ్ర శక్తులు ఒడ్డుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మమత ఆరోపణలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆమెవి నిరాధార ఆరోఫణలు అన్నారు. బెంగాల్ లో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

Next Story
Share it