Telugu Gateway
Cinema

మీ బాబుకి ‘మందు అవసరం’

మీ బాబుకి ‘మందు అవసరం’
X

‘కొందరికి మందు తాగటం సరదా. కొంత మందికి అది వ్యసనం. బట్..మీ బాబుకి అది అవసరం.’ ఓ చిన్నపిల్లాడికి డాక్టర్ ఇచ్చిన ప్రిస్కిప్షన్ అది. ఉద్యోగానికి వెళ్ళి అన్ని సర్టిఫికెట్లతోపాటు ఆథరైజ్డ్ డ్రింకర్ సర్టిఫికెట్. వాటీస్ దిస్ అంటూ ఇంటర్వ్యూలో ఉన్న వాళ్ళు అవాక్కు అయితే..మూడు పూటలా..మూడు 90 ఎంఎల్ తాగాలి బాసూ అంటూ హీరో కార్తికేయ ఇఛ్చే సమాధానం. ఇలాంటి ఎన్నో సరదా సరదా సన్నివేశాలతో 90ఎంఎల్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది.

ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నేహ సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. హీరోనేమో ముందు తాగకపోతే చచ్చిపోతాడు...హీరోయిన్ ఫ్యామిలీకేమో ముందు అంటేనే ఏ మాత్రం పడదు. ఇలాంటి ఫ్యామిలీ మధ్య జరిగే సంఘర్షణ అన్న చందంగా సినిమా ఉండబోతుందని ట్రైలర్ లో చెప్పేశారు. ఓ జన్మలో ఏ యాగం చేశారో రాజా వారు..ఈ జన్మలో ఈ యోగంతో పుట్టారు అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

https://www.youtube.com/watch?v=HFN3PUo18oY

Next Story
Share it