Telugu Gateway
Telangana

ఆర్టీసీ కార్మిక నేతల దీక్షలు..అరెస్ట్ లు

ఆర్టీసీ కార్మిక నేతల దీక్షలు..అరెస్ట్ లు
X

ఆర్టీసీ సమ్మె విషయంలో సర్కారు వైఖరి ఏ మాత్రం మారలేదు. అత్యంత కీలకమైన విలీనం డిమాండ్ ను వదులుకున్నట్లు కార్మిక సంఘం నేతలు ప్రకటించినా కూడా సర్కారు స్పందించటం లేదు. సమ్మె కార్యాచరణలో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు శనివారం నాడు దీక్షలకు కూర్చోవాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రమంతటా పోలీసులు ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ లు చేశారు. బస్టాండ్ల దగ్గర దీక్షలకు అనుమతి ఇచ్చేదిలేదని, బస్ రోకోలను కూడా అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్ట్ లు తప్పవని హెచ్చరించారు. ఇందిరా పార్కు వద్ద దీక్షకు పోలీసులు నో చెప్పటం ఆర్టీసీ కార్మిక సంఘం జెఏసీ నేత అశ్వత్థామరెడ్డి ఇంట్లోనే దీక్షకు దిగారు. మరికొంత మంది దీక్ష చేస్తున్న నేతలు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ స్టేషన్లలో అయినా దీక్షలు చేస్తామని నేతలు చెబుతున్నారు.

పలు చోట్ల ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేస్తున్నారు. గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేయొద్దని, బస్సుల రాకపోకలు అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు. నగరంలో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయని, నిబంధనలు పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ఇంట్లోనే దీక్షకు కూర్చున్న అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాత్కాలికంగానే విలీనం డిమాండ్ ను పక్కన పెట్టామని తెలిపారు. మిగిలిన 26 డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఇఫ్పటివరకూ చేసిన పోరాటాలు అన్నీ విజయవంతం అయ్యాయని వ్యాఖ్యానించారు.

Next Story
Share it