Telugu Gateway
Telangana

ఆర్టీసీలో రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు బ్రేక్

ఆర్టీసీలో రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు బ్రేక్
X

తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణ వ్యవహారానికి హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్ళిన నేపథ్యంలో సర్కారు అన్ని రూట్లను ప్రైవేట్ పరం చేస్తామని..ఇలా అయితే ఆర్టీసి మూతే అంటూ హెచ్చరిస్తూ వస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో 5100 రూట్ల ప్రైవేటీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై విశ్వేశ్వరరావు అన్న వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు శుక్రవారం నాడు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాష్ట్ర కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ ను తమ ముందు ఉంచాలని తెలిపింది. సోమవారం వరకు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 11కి వాయిదా వేసింది. అదే రోజు ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదలకు సంబంధించి కూడా హైకోర్టు విచారణ చేపట్టనుంది. గురువారం ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కార్మికులతో చర్చలు జరపాలని మరోసారి ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it