Telugu Gateway
Telangana

హెచ్1 బీ వీసాదారులకు గుడ్ న్యూస్

హెచ్1 బీ వీసాదారులకు గుడ్ న్యూస్
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి అక్కడి కోర్టులో చుక్కెదురు అయింది. ఇది హెచ్1బీ వీసా హోల్డర్లకు ఇది శుభవార్తగానే చెప్పొచ్చు. ఒబామా హయాంలో హెచ్ 1బీ వీసా కలిగిన వారి భాగస్వాములకు వర్క్ పర్మిట్లు ఇచ్చారు. ట్రంప్ సర్కారు వచ్చాక ఈ పర్మిట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయానికి కోర్టు బ్రేక్ వేసింది. ఇది ముఖ్యంగా భారతీయులకు, ప్రత్యేకించి మహిళలకు ఈ ఆదేశాలు ఊరటనిచ్చినట్లు అయింది. హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగాల కల్పన విషయంలో... అమెరికా యువత డిమాండ్ నేపధ్యంలో ట్రంప్ సర్కారు నిబంధనలను కఠినతరం చేసింది.

ఈ చర్యలను సవాలు చేస్తూ అమెరికా కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. ఈ క్రమంలో... ఓ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడంతో భారతీయులకు, ప్రత్యేకించి భారత మహిళకు తాత్కాలికంగానైనా ఊరట లభించినట్లైంది. కోర్టు ఆదేశాలపై ట్రంప్ సర్కారు ఎలా ముందుకెళుతుంది వేచిచూడాల్సిందే. గతంతో పోలిస్తే ఇప్పుడు హెచ్ 1 బీ వీసాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. స్థానికులకే ఉద్యోగాలు అన్న విషయంలో ట్రంప్ గత అధ్యక్షులకు భిన్నంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it