Telugu Gateway
Cinema

బాలకృష్ణ న్యూలుక్

బాలకృష్ణ న్యూలుక్
X

‘రూలర్’ సినిమాకు సంబంధించి బాలకృష్ణ న్యూలుక్ హల్ చల్ చేస్తోంది. అంతకు ముందు విడుదల చేసిన పోలీసు లుక్ చూసి అభిమానులు ఒకింత షాక్ కు గురయ్యారనే చెప్పాలి. ఆ లుక్ అలా ఉంది మరి. దీనిపై బాలయ్య అభిమానుల నుంచి కూడా తీవ్ర విమర్శలు విన్పించాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో బాలయ్య రెండు చేతులు చాపి పైకి చూస్తు ఉన్నాడు. ఇక డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌ తో పాటు అతడు వేసుకున్న షూస్‌ ట్రెండీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య తన రూపం, ఆహార్యం పూర్తిగా మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివర దశకు చేరడంతో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ ,భూమిక కీలక పాత్రలు పోషించారు. రూలర్‌ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సోనాల్‌ చౌహాన్‌, వేదికలు నటిస్తున్నారు.

Next Story
Share it