Telugu Gateway
Andhra Pradesh

ఇంగ్లీష్ కు..మతానికి సంబంధం ఏంటి?

ఇంగ్లీష్ కు..మతానికి సంబంధం ఏంటి?
X

తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియానికి మతానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారని మంత్రి అవంతి ప్రశ్నించారు. ఐటీకి తానే ఆద్యుడిని అని చెప్పుకునే చంద్రబాబు.. ఇంగ్లీష్‌ను వ్యతిరేకించడమేంటన్నారు. కుల, మత రాజకీయాలు చేయడంలో టీడీపీ దిట్ట అని విమర్శించారు. కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. మతపరమైన అంశాలను లేవనెత్తి ఆరెస్సెస్, బీజేపీలను వైసీపీకి దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ-వైసీపీ మధ్య చెడితే తాను దూరాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

అందుకే నిన్నటి వరకు మోదీని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు పొగిడే పరిస్థితికి వచ్చారని అన్నారు. తనకు డయాబెటిస్ ఉందని, స్వామి మాలలో చెప్పులు వేసుకోవడం తప్పేమీకాదన్నారు. మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా మాలలో ఉన్న సమయంలో చెప్పులు వేసుకున్నారని గుర్తుచేశారు. హిందువుగానే పుట్టానని, హిందువుగానే చనిపోతానని అవంతి వ్యాఖ్యానించారు. మూడు పూటలా పూజ నిర్వహించనిదే భోజనం కూడా చేయనని తెలిపారు. కుట్రలో భాగంగానే తనపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చింతమనేని ప్రభాకర్ అంశంపైనా మంత్రి అవంతి స్పందించారు. జైల్లో ఉండి చింతమనేనికి సింపతి వచ్చింది కాబట్టే చంద్రబాబు ఆయన వద్దకు వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు కారణంగానే చింతమనేని అలా అయ్యారని అన్నారు.

Next Story
Share it