Telugu Gateway
Andhra Pradesh

కడప స్టీల్ ప్లాంట్ కు 3200 ఎకరాలు..కేబినెట్ నిర్ణయం

కడప స్టీల్  ప్లాంట్ కు 3200 ఎకరాలు..కేబినెట్ నిర్ణయం
X

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ఇనుప ఖనిజం సరఫరాకు సంబంధించి ఎన్ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకోవటానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నాడు అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మలమడుగు మండలం పెదదండ్లూరు వద్ద 3200 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో ఏపీ ప్రజలపై పలు వరాలు ప్రకటించారు. ఏపీలో కొత్త రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, జగనన్న విద్యా దీవెన కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిగ్రీ ఆపై ఉన్నత విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు జగనన్న వసతి పథకం కింద రూ. 20 వేలు చెల్లింపు, వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలపై, కొత్త బార్‌ పాలసీలకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు వివరాలు ఇవే...

వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి రూ.1,101కోట్ల కేటాయింపు

కాపు సామాజిక మహిళలకు ఏడాదికి రూ.15వేలు సాయం

45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు సాయం

రెండున్నర లక్షల రూపాయల ఆదాయం ఉన్న కాపులకు వైఎస్సార్‌ కాపు నేస్తం వర్తింపు

పది ఎకరాల మాగాణి, 25ఎకరాల లోపు మెట్ట ఉన్నవారికి వర్తింపు

ట్రాక్టర్‌, ఆటో, ట్యాక్సీ నడుపుకునేవారికి మినహాయింపు

టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య 19నుంచి 29కి పెంచుతూ నిర్ణయం

పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్‌ నిర్ణయం

ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ

ఇళ్ల పట్టాలపై పేదలకు హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌కు నిర్ణయం

జగనన్న వసతి పథకానికి కేబినెట్‌ ఆమోదం​.రెండు విడతలుగా జగనన్న వసతి దీవెన, రూ.2,300 కేటాయింపు

ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు

డిగ్రీ, ఉన్నత విద్యార్థులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం

కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు కేబినెట్‌ ఆమోదం.

3.295 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయం.

ఇనుప ఖనిజం సరఫరాపై ఎన్‌ఎండీసీతో ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌ బ్యాంకు నుంచి రుణాలు

మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం

ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కోసం రూ.3,400 కోట్లు కేటాయింపు

సీపీఎస్‌ రద్దుపై ఏర్పాటైన వర్కింగ్‌ కమిటీకి ఆమోదం

గిరిజన ప్రాంతాల్లో ఆశావర్కర్ల జీతం రూ. 400 నుంచి రూ.4వేలకు పెంపు.

Next Story
Share it