Telugu Gateway
Cinema

నిశ్శబ్దంలో ‘అంజలి’ ఫస్ట్ లుక్

నిశ్శబ్దంలో ‘అంజలి’ ఫస్ట్ లుక్
X

తాజాగా అనుష్క ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ‘నిశ్శబ్దం’ చిత్ర యూనిట్ తాజాగా మరో హీరోయిన్ అంజలి లుక్ ను విడుదల చేసింది. ఇందులో అంజలి చాలా పవర్ ఫుల్ లుక్ లో కన్పిస్తున్నారు. అంజలి ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలమే అయింది. ఇఫ్పుడు నిశ్శబ్దంతో రానుంది. నిశ్శబ్దం సినిమా రచయిత కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్కతో పాటు మాధవన్‌, అంజలి, షాలినీ పాండే లు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబరు 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్‌ చేసేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్.

అమెరికాలోని సియోటెల్‌ కేంద్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి పవర్‌ఫుల్‌ క్రైం డిటెక్టివ్‌ ఏజెంట్‌ మహాగా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. అనుష్క ఈ సినిమాలో మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భాగమతి చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ‘నిశ్శబ్ధం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story
Share it