Telugu Gateway
Cinema

‘ఒక సారి చూస్తే చాలు’ అంటున్న కార్తికేయ

‘ఒక సారి చూస్తే చాలు’ అంటున్న కార్తికేయ
X

హీరో కార్తికేయ 90ఎంఎల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పాటను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదలైంది. ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘ఒకసారి చూస్తే చాలు. ఒకసారి నవ్వితే చాలు. ఒక అడుగు నాతో వేస్తే చాలు’ అంటూ ఇందులో కార్తికేయ బాగానే సందడి చేశాడు. ఈ పాటలో కార్తికేయ స్టెప్స్ తోపాటు మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ ఈ పాటకు ట్యూన్‌ కట్టగా.. చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించాడు. ఈ పాటకు అద్నాన్‌ సమీ వాయిస్‌ ఈ పాటకు మరింత హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్‌ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

https://www.youtube.com/watch?time_continue=283&v=vqEy-A3xfM4&feature=emb_logo

Next Story
Share it