వాహనమిత్రకు శ్రీకారం చుట్టిన జగన్
ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ఆటోవాలాలకు పది వేల రూపాయలు అందించారు. ఈ పథకాన్ని జగన్ శుక్రవారం నాడు ఏలూరులో ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో హామీ ఇచ్చిన మేరకు ఆటోవాలాలకు ఆర్ధిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ. 10 వేలు అందించనున్నారు.
దేశంలో ఈ తరహా కార్యక్రమం మొదటిది ఇదే అని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్దిదారులు ఏడాదికి రూ. 10 వేల చోప్పున అందుకోనున్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో ‘వైఎస్సార్ వాహన మిత్ర’ప్రారంభించారు.