Telugu Gateway
Politics

కెసీఆర్ సర్కారుకు బిగ్ షాక్..సచివాలయం కూల్చివేతకు బ్రేక్

కెసీఆర్ సర్కారుకు బిగ్ షాక్..సచివాలయం కూల్చివేతకు బ్రేక్
X

తెలంగాణలో కెసీఆర్ కు సర్కారుకు ఊహించని షాక్. సచివాలయ భవనాలను కూల్చివేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ కు సూచించింది. ఈ అంశం ఇప్పటికే తమ ముందు ఉన్నందున తీర్పు వెలువడక ముందు ఎలాంటి కూల్చివేతలు చేయవద్దని ఆదేశించింది. అయితే అడ్వకేట్ జనరల్ మాత్రం తాము కూల్చివేతకు ఇప్పటికే కసరత్తు అంతా పూర్తి చేశామని..ప్రభుత్వాన్ని అనుమతించాలని కోరారు.సచివాలయం కూల్చివేత..కొత్త నిర్మాణాలు విధానపరమైన నిర్ణయం అని కోర్టు కు అడ్వకేట్ జనరల్ నివేదించారు. అయినా సరే తమ తుది తీర్పు వచ్చేవరకూ ఎలాంటి కూల్చివేతలు వద్దని స్పష్టం చేసింది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణ ప్రక్రియ మరింత జాప్యం కానుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సచివాలయాన్ని పూర్తిగా ఖాళీ చేసి కూల్చివేతకు సిద్ధం అవుతున్న తరుణంలో హైకోర్టు తీర్పు షాక్ లాంటిదే అని చెప్పొచ్చు.

వాస్తవానికి మంగళవారం నాడు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో కూడా సచివాలయ డిజైన్లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చిన తరుణంలో హైకోర్టు తీర్పు సర్కారుకు షాక్ లా తగిలిందనే చెప్పొచ్చు. సచివాలయ భవనాలు ఖాళీ చేయటం వల్ల పనికి అవాంతరాలు ఉంటాయని విపక్షాలు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా సర్కారు మాత్రం ముందుకెళ్ళటానికే నిర్ణయం తీసుకుంది. హైకోర్టు కొద్ది రోజుల క్రితం ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేతను కూడా హైకోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సచివాలయ భవనాల వంతు వచ్చింది. దసరా సెలవుల అనంతరం ఎంత తొందర వీలైతే అంత తొందరగా దీనిపై విచారణ జరిపి తుది నిర్ణయం ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది.

Next Story
Share it