Telugu Gateway
Politics

తెలంగాణలో ఇక మున్సి‘పల్స్’ పోరు

తెలంగాణలో ఇక మున్సి‘పల్స్’ పోరు
X

తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధం అయింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం..ఎన్నికల సంఘం రంగంలోకి దిగటమే మిగిలింది. మున్సిపల్‌ వార్డుల విభజన, రిజర్వేషన్లకు సంబంధించి పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అయితే తాజాగా మున్సిపల్‌ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. అయితే రిజర్వేషన్ల ఖరారు..వార్డుల విభజనకు సంబంధించి కావాల్సిన సమయంపై సర్కారు కోర్టుకు తెలిపిన గడువు..వాస్తవంగా వాటిని పూర్తి చేసిన రోజుల్లో తేడా ఉండటంపై విచారణ సందర్భంగా కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

రిజర్వేషన్లతోపాటు...వార్డుల విభజన అస్తవ్యస్తంగా చేశారని పలు జిల్లాల నుంచి కోర్టుల్లో పిటీషన్లు దాఖలు అయ్యాయి. తెలంగాణలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవి కాలం ఇంకా ఉ:ది. దీంతో ఇఫ్పుడు పది కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందులో కొన్ని మినహాయింపులు ఉంటాయి. పదవి కాలం ఉన్న వాటిని వదిలేసి..మిగిలిన వాటికి మాత్రమే ఎన్నికలు జరపనున్నారు.

Next Story
Share it