Telugu Gateway
Telangana

కెసీఆర్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు

కెసీఆర్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు
X

ఆర్టీసి సమ్మె వ్యవహారంపై తెలంగాణ బిజెపి శాఖ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై కు వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలో ఆర్టీసి ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు గవర్నర్ ను కోరారు. గవర్నర్ తో భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..‘ఆర్టీసీ సమ్మె విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాం. గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 50వేల మంది కార్మికులను విధుల నుండి తొలగించామని పేర్కొనడం బాధాకరం.కార్మికులను తొలగిస్తే చూస్తూ కూర్చోమన్నారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను, ప్రజల బాధలను పట్టించుకోని ప్రభుత్వం. తెలంగాణ ఆస్తులను తన ఆప్తులకు కట్టబెట్టే ప్రయత్నం కేసిఆర్ చేస్తున్నారు.కార్మికుల డిమాండ్లు కొత్తవేం కాదు. తెలంగాణ రాకముందు కేసీఆర్ కూడా ఈ డిమాండ్లు చేశారు.పన్నులు తగ్గిస్తే ఆర్టీసీ లాభాల్లో నడుస్తుందని కేసీఆర్ అన్నారు.కేసీఆర్ అగ్గితో గోక్కుంటున్నాడు.మానవత్వం లేకుండా ఆర్టీసీ హాస్పిటల్ లో సేవలను ఆపేశారు.ప్రజలందరినీ ఏకం చేసి కేసీఆర్ ను గద్దె దించుతాం.ఆర్టీసీ ఆస్తులను కాపాడే బాధ్యత గవర్నర్ పై ఉంది.తెలంగాణలో మరో ఉద్యమం తప్పేలా లేదు.ఆర్టీసిపై పోరాడడానికి మా కార్యచరణ ప్రకటిస్తాం.’అని వెల్లడించారు.

Next Story
Share it