Telugu Gateway
Telangana

ఉద్రిక్తంగా తెలంగాణ బంద్

ఉద్రిక్తంగా తెలంగాణ బంద్
X

అరెస్ట్ లు..నిరసనలు. ఎక్కడి బస్ లు అక్కడే. అక్కడక్కడ ఉద్రికత్తలు. తోపులాటలు. దాడులు. ఇదీ శనివారం నాడు తెలంగాణ బంద్ తొలి సీన్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అన్ని పార్టీలు తెలంగాణ బంద్ కు మద్దతు ప్రకటించాయి. అంతే కాదు..ఉద్యోగ సంఘాలు కూడా ఆర్టీసి సమ్మెకు అనుకూలంగా రంగంలోకి దిగాయి. అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలను హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ శనివారం ఉదయమే అరెస్ట్ లు చేశారు. బంద్ ను అడ్డుకునేందుకు సర్కారు చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదనే చెప్పొచ్చు.

రాష్ట్రంలో చాలా చోట్ల బంద్ ప్రభావం స్పష్టంగా కన్పించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగి పోయింది. పోలీసులు వ్యాన్ లో ఎక్కించే క్రమంలో రెండు తలుపుల మధ్య వేలు పెట్టి నొక్కి కట్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. బంద్ ప్రారంభం అయిన కొద్ది గంటలకే కార్మిక సంఘాల నేతలు..పలు పార్టీల కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి బంద్ విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు.

Next Story
Share it