Top
Telugu Gateway

చంచల్ గూడ జైలులో రవిప్రకాష్

చంచల్ గూడ జైలులో రవిప్రకాష్
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం ఆయన అరెస్ట్ ను అధికారికంగా ప్రకటించి..వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పర్చగా ఆయనకు కోర్టు 18వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసు ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. 18 కోట్ల రూపాయల మేర నిబంధనలకు విరుద్ధంగా తరలించారనే ఆరోపణల కేసులో అరెస్ట్‌ అయిన రవిప్రకాష్ చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు.

రవిప్రకాశ్‌కు జైలు అధికారులు అండర్‌ ట్రయిల్‌ ఖైదీ నెంబర్‌ 4412ను కేటాయించి... కృష్ణా బ్యారక్‌లో ఉంచారు. రవిప్రకాష్ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 9న వాదనలు జరగనున్నాయి. రవిప్రకాష్ మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకున్నారంటూ ప్రస్తుత టీవీ9 సీఈవో జీ సింగారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు.

Next Story
Share it