Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ ‘సాంగ్’ టీజర్ వచ్చేసింది

అల్లు అర్జున్ ‘సాంగ్’ టీజర్ వచ్చేసింది
X

అల..వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ‘రాములో రాములా’ పాటకు సంబంధించిన టీజర్ వచ్చేసింది. ముందు చెప్పినట్లుగా సోమవారం కాకుండా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ దీన్ని విడుదల చేసింది. ‘రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో..రాములో రాములా నా పానం తీసిందిరో. ’ అంటూ అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డెల డ్యాన్స్ బిట్స్ తో ఈ టీజర్ విడుదలైంది. ఇందులోనూ జోష్ కన్పిస్తోంది.

పూర్తి పాటను మాత్రం ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపారు. సినిమా సంక్రాంతి బరిలో అంటే జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన’ సాంగ్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మరి ఈ కొత్త పాట పూర్తిగా విడుదలైన తర్వాత ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=w7Nm_RHOCT8

Next Story
Share it