Telugu Gateway
Andhra Pradesh

కృష్ణా ఇన్ ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి..కన్నబాబుకు విశాఖ

కృష్ణా ఇన్ ఛార్జి మంత్రిగా పెద్దిరెడ్డి..కన్నబాబుకు విశాఖ
X

ఏపీ సర్కారు జిల్లాల ఇన్ ఛార్జి మంత్రుల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకూ కృష్ణా జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబును అక్కడ నుంచి మార్చి విశాఖపట్నం బాధ్యతలు అప్పగించారు. ఇఫ్పటివరకూ విశాఖపట్నం బాధ్యతలు చూసిన తూర్పు గోదావరి బాధ్యతలు కేటాయించారు. కృష్ణా జిల్లా బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేటాయించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం ఆయా జిల్లాల వారీగా ఇంచార్జ్‌ మంత్రులను నియమించారు. ఈ ఏడాది జూలై 4న ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేసి..కొత్తగా ఈ నియామకాలు చేపట్టారు. తాజాగా ఆదేశాల మేరకు మంత్రులకు కేటాయించిన జిల్లాల వారీ వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాల వారీగా ఇంచార్జీ మంత్రుల వివరాలు

శ్రీకాకుళం - కొడాలి నాని

విజయనగరం - వెల్లంపల్లి శ్రీనివాసరావు

విశాఖపట్నం - కురసాల కన్నబాబు

తూర్పుగోదావరి - మోపిదేవి వెంకటరమణ

పశ్చిమగోదావరి -పేర్ని వెంకట్రామయ్య

కృష్ణా - పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

గుంటూరు - చెరుకువాడ రంగనాథరాజు

ప్రకాశం - బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

నెల్లూరు - బాలినేని శ్రీనివాస రెడ్డి

కర్నూలు - అనిల్‌ కుమార్‌ యాదవ్‌

వైఎస్‌ఆర్‌ కడప - ఆదిమూలపు సురేష్‌

అనంతపురం - బొత్స సత్యనారాయణ

చిత్తూరు - మేకపాటి గౌతమ్‌ రెడ్డి

Next Story
Share it