చూసుకుందాం రండిరా అంటున్న మహేష్
BY Telugu Gateway7 Oct 2019 6:13 PM IST
X
Telugu Gateway7 Oct 2019 6:13 PM IST
మహేష్ బాబు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర గొడ్డలి పట్టుకుని రెడీగా ఉన్నాడు. ఆ లుక్ చూసుకుందాం రండిరా అన్నట్లు ఉంది. దసరా పండగను పురస్కరించుకుని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు సంబంధించిన కొత్త లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్‌రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఆర్మీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
Next Story