Telugu Gateway
Politics

హుజూర్ నగర్ తీర్పు టానిక్..కెసీఆర్

హుజూర్ నగర్ తీర్పు టానిక్..కెసీఆర్
X

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలుపు తమ ప్రభుత్వానికి టానిక్ లా పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. మరింత ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ గెలుపును తాము బాధ్యతగానే తీసుకుంటామని..అంతే తప్ప అహంభావంతో ఎవరూ వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కెసీఆర్. మీడియా సమావేశంలో కెసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘అలవోకగా ప్రజలు ఓటు వేయలేదు. ఆలోచించి ఓటువేశారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత ఆరోపణలు చేసిన 43వేల ఓట్లకు పైగా మెజారిటీ ఇఛ్చారు. హుజూర్ నగర్ ప్రజలు ఏ అభివృధ్ధికోసం ఓటు వేశారో ఆ ఆశలు నెరవేరుస్తాం.నేను కృతజ్ఞత కోసం హుజూర్ నగర్ కు వెళతాను.భారీ సభ నిర్వహిస్తాం.ప్రతి పక్షాలకు నా సలహా....మీ పంథా మార్చుకోండి,పాత్రలు మారినా మన రాష్ట్రాన్ని ఏ అంశాన్ని ఎత్తుకోవాలో తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించరు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు పంథా మార్చుకోవాలి. సద్విమర్శ చేసే ప్రతి పక్షం అవసరం. కేసీఆర్ ను తిడితే పెద్దవాళ్ళు కాలేరు.ప్రజలు 100శాతం అన్ని అంశాలను గమనిస్తున్నారు.పొద్దున లేస్తే నన్ను తిట్టుడే ప్రతిపక్షాలు పని పెట్టుకున్నాయి.

అహంభావం వద్దు. మేము ఎన్నో విజయాలు సాధించాం. అయినా నిబద్దతో పని చేస్తున్నాం.మేము మరింత బాధ్యతగా పనిచేస్తాం.డ్రింకింగ్ వాటర్,విద్యుత్ కోసం కొన్ని తక్షణ చర్యలు చేపట్టాం.నీటిపారుదల కోసం ప్రాజెక్టులు చేపడుతున్నాం కాళేశ్వరం దగ్గర పడింది. కొన్ని పార్టీలు ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలని కేసీఆర్ వచ్చే హెలికాఫ్టర్ చెక్ చేయాలి అని పిర్యాదు చేశారు..కేసీఆర్ హెలికాఫ్టర్ లో డబ్బులు తీసుకుపోతాడా... ఈ గెలుపు మాములు గెలుపై కాదు...అఖండ విజయం. పల్లె ప్రగతి చాలా అద్భుతంగా జరిగింది. కొత్త రెవెన్యూ చట్టం రావాల్సి ఉంది,కొత్త మున్సిపల్ చట్టం తెచ్చాం. గ్రామ పంచాయతీల 339 కోట్లు కేటాయిస్తాం. 1030 కోట్లు మున్సిపాలిటీలకు. కేటాయిస్తాం. 2060 కోట్ల రూపాయలు 141 మున్సిపాలిటీలు కేటాయిస్తాం. వచ్చే 2నుండి 3రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. పట్టణ ప్రగతి పేరిట నెల రోజుల పాటు నగరాల అభివృద్ధి చేస్తాం. మహారాష్ట్ర ఎన్నికలపై టీవీ లలో పెద్ద పెద్ద గా చూపిస్తున్నారు. మీ దగ్గర జరిగే అభివృద్ధి మా వద్ద జరగడం లేదు అని మహారాష్ట్ర జిల్లా వాసులు నన్ను అడిగారు. టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తాము అన్నారు...కానీ నేను మా రాష్ట్రం పైన దృష్టిపెట్టాం అని చెప్పాను. ’ అని కెసీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it