Top
Telugu Gateway

ఏషియన్ సినిమా కార్యాలయాలపై ఐటి దాడులు

ఏషియన్ సినిమా కార్యాలయాలపై ఐటి దాడులు
X

టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబుతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులతో కలసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై ఐటి దాడులు జరిగాయి. మంగళవారం సంస్థకు చెందిన వివిధ కార్యాలయాలతోపాటు ఈ సంస్థ యాజమానుల బంధువుల ఇళ్ళలో కూడా తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇళ్లలో తనిఖీలు సాగాయి.

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో కలిసి ఏషియన్ సినిమాస్‌ సంస్ద ఏఎంబీ మాల్‌ను ఏర్పాటు చెసిన సంగతి తెలిసిందే. నైజాంలో‌ భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్‌ ను కూడా నిర్మించింది. హీరో అల్లు అర్జున్‌తో మరో మల్లీఫ్లెక్స్‌ ను కూడా నిర్మించబోతోంది. ప్రస్తుతం ఈ సంస్థ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమాని నిర్మిస్తోంది.

Next Story
Share it