Telugu Gateway
Telangana

ఆ కాంట్రాక్టర్ వాళ్లకు ‘దేవుడా’..! రెండు ఐటి దాడులు...మీడియాలో తేడాలు

ఆ కాంట్రాక్టర్ వాళ్లకు ‘దేవుడా’..! రెండు ఐటి దాడులు...మీడియాలో తేడాలు
X

రెండు ఐటి దాడులు...మీడియాలో తేడాలు!

రెండు ఐటి దాడులు. రెండు చోట్లా భారీ అక్రమాలు..అవకతవకలు. ఐటి దాడుల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. అందులో ఒకటి కల్కీ ఆశ్రమం. అక్కడ నగదు కట్టలు కట్టలుగా దొరికింది. ఒక్క నగదు ఏమిటి వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు సంబంధించిన లావాదేవీలు వెలుగు చూశాయి. కల్కి ఆశ్రమయంలో ఐటి శాఖకు దొరికిన విషయాలను ప్రధాన ఛానళ్ళు..ప్రధాన మీడియా ఊదరగొట్టింది. హోరెత్తించింది. అందులో నిజంగా తప్పుపట్టాల్సింది ఏమీలేదు. కల్కిని దేశ, విదేశాలకు చెందిన భక్తులు కొంత మంది ఓ దేవుడిగా భావిస్తారు. అందుకే ఆయనకు అంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో ఎన్నో వ్యాపారాలు..దేశంలోనే కాదు..విదేశాల్లో కూడా లావాదేవీలు. కొంత మంది ప్రజలకు ఆ కల్కి దేవుడు అయితే...కొన్ని ప్రధాన ఛానళ్ళు..ప్రధాన మీడియాకు ఆ కాంట్రాక్టర్ దేవుడు కింద లెక్క అన్నమాట. అందుకే ఐటి శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసినా సో కాల్డ్ ఆ ఛానళ్ళు మాత్రం ఒక్క స్క్రోలింగ్ వేయం..ప్రధాన పత్రికలు కొన్ని సింగిల్ కాలం వార్త రాయవు.

వారం రోజులు వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రెండు భారీ ఐటి దాడులకు సంబంధించిన మీడియా అనుసరించి తీరు చూసి ప్రేక్షకులు..పాఠకులు కూడా అవాక్కయ్యే పరిస్థితి. ఏ చిన్న వ్యాపారి దగ్గర అయినా పది కోట్లు..25 కోట్ల రూపాయల లోపు దొరికినా అసలు కొన్ని ఛానళ్ళు మామూలు హంగామా చేయవు. మరి ఓ బడా కాంట్రాక్టర్ దగ్గర భారీ ఎత్తున నగదు దొరకటంతోపాటు..వందల కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు జరిగాయని ఐటి శాఖ అధికారికంగా ప్రకటించినా అవి మాత్రం ఆయన్ను ‘దేవుడి’గా పరిగణిస్తాయి. అందుకే ఆ వార్త అసలు బయటకు రాకుండా తొక్కేస్తాయి. ఎవరో ప్రజలు నమ్మే దేవుడు కల్కి మీద అయితే బ్రేకింగ్ న్యూస్ లు ‘బ్రేక్ డ్యాన్స్ లు’ చేస్తాయి. వాళ్ల దేవుడు (కాంట్రాక్టర్) వరకూ వచ్చేసరికి పండ్లు..‘ఫలహారాలు’ తిని చల్లగా బొచ్చుంటాయి.

Next Story
Share it