Telugu Gateway
Cinema

‘చాణక్య’ సెన్సార్ పూర్తి

‘చాణక్య’ సెన్సార్ పూర్తి
X

గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన ‘చాణక్య’ సినిమా విడుదలకు సిద్ధం అయింది. గురువారం నాడు ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ అయింది. గత కొంత కాలంగా సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న గోపీచంద్ కు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో..వేచిచూడాల్సిందే. చాణక్య అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓ వైపు థియేటర్లలో ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహరెడ్డి హంగమా కొనసాగుతున్న సమయంలో చిత్ర యూనిట్ విడుదలకు నిర్ణయం తీసుకోవటం అత్యంత సాహసమే అని చెప్పుకోవచ్చు. చిత్ర యూనిట్ కు సక్సెస్ పై అంత నమ్మకం ఉందా? లేక రిస్క్ అయినా సరే అని సైరా హంగామా నడుస్తున్నా కూడా విడుదల చేస్తున్నారా? అన్నది వేచిచూడాల్సిందే. ఎఫ్ 2 సినిమాతో మెహరీన్ మంచి హిట్ అందుకున్న తర్వాత నటించిన సినిమానే ‘చాణక్య’.

Next Story
Share it