Telugu Gateway
Telangana

రవిప్రకాష్ పై మరో కేసు

రవిప్రకాష్ పై మరో కేసు
X

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై వరస కేసులు నమోదు అవుతున్నాయి. ఇఫ్పటికే టీవీ9లో సీఈవోగా ఉన్న సమయంలో 18 కోట్ల రూపాయల మేర నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణపై అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ ను తాజాగా కోర్టు తిరస్కరించింది. ఈ తరుణంలో రవిప్రకాష్ పై మరో కేసు నమోదు కావటం కీలక పరిణామంగా మారింది.

చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న రవి ప్రకాశ్ ను పిటీ వారెంట్ పై కస్టడీలోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఆయన్ను మియాపూర్ కోర్టుకు తీసుకెళ్ళారు. నకిలీ ఐడి కేసులో రవిప్రకాష్ పై ఈ కేసు నమోదు అయినట్లు చెబుతున్నారు.'ఐ ల్యాబ్' పేరు తో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసిన రవి ప్రకాష్ పై 406/66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story
Share it