Telugu Gateway
Politics

కాంగ్రెస్ భవితవ్యంపై ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ భవితవ్యంపై ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు
X

‘రాహుల్ వదిలేశారు. సోనియా తాత్కాలికం అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అత్యంత కీలకమైన మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికలు ఎలా ఎదుర్కొంటుంది?. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఫల్యాలను గుర్తించటంలో పార్టీ విఫలమైందన్నారు. దీంతోనే పార్టీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేయటం పార్టీలో కలకలం రేపుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి ఇంత వరకూ సరైన కారణాలు ఇప్పటి కూడా గుర్తించలేకపోయరని విమర్శించారు. ఈ దిశగా సరైన విశ్లేషణ జరగలేదని అభిప్రాయపడ్డారు.

అధ్యక్షుడిగా ఉండాల్సిన రాహుల్ పదవి వదిలేశారని..సోనియాగాంధీ మాత్రం తాను తాత్కాలికం అన్న భావనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇంతటి కీలక సమయంలో పూర్తి స్థాయి అధ్యక్షుడి నియామకం దిశగా చర్యలు తీసుకోకపోవటం ఏ మాత్రం సరికాదని పేర్కొన్నారు. పార్టీని నడిపించే సరైన నాయకుడు లేకపోవటమే ఇప్పుడు పార్టీకి అతి పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల మధ్య పోరాటాలు సాగుతున్నాయి. కొంత మంది పార్టీని కూడా వీడి వెళుతున్నారు. అయినా అధిష్టానం నుంచి పెద్దగా దిద్దుబాటు చర్యలు జరుగుతున్న దాఖలాలు కన్పించటం లేదు.

Next Story
Share it