Telugu Gateway
Cinema

చిరంజీవి..కొరటాల శివ సినిమా ప్రారంభం

చిరంజీవి..కొరటాల శివ సినిమా ప్రారంభం
X

చిరంజీవి కొత్త సినిమా మొదలైంది. ఓ వైపు సైరా నరసింహరెడ్డి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా కొత్త చిత్రం లైన్ లో పెట్టాడు. ఈ సినిమాకు సంచలన సినిమాలను తెరకెక్కించిన కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ఇది చిరంజీవి 152వ సినిమా. దసరా పండుగను పురస్కరించుకొని సినిమాకు సంబంధించిన పూజా కార్యాక్రమాన్ని చిత్ర సభ్యులు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవుడి చిత్రపటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి భార్య సురేఖ క్లాప్‌ కొట్టారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాల శివతో పాటు అంజనీ దేవి, సురేఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Next Story
Share it