Telugu Gateway
Cinema

నితిన్..ఏమి చేస్తున్నావ్ !

నితిన్..ఏమి చేస్తున్నావ్ !
X

రష్మిక స్టైల్ గా అలా నడుస్తూ ముందుకు పోతుంది. వెనకే వస్తున్నాడు భీష్మ. అదేనండి హీరో నితిన్. మెల్లగా వెనక నుంచి వస్తూ ఏమి చేయబోతున్నాడు. ఎవరైనా పెద్దొళ్ళు చూస్తే యాయ్..ఏమి చేస్తున్నావ్ అని గద్దిస్తారు. బయట అయితే ఏకంగా కేసు పెట్టి లోపలోస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది సినిమా కనుక. హీరో నితిన్ మెల్లగా వెనక నుంచి వస్తూ రష్మిక నడుము ను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది.

దీంతోపాటు మరో ఫైట్ సీన్ తో కూడిన లుక్ ను కూడా విడుదల చేశారు. కాకపోతే రష్మిక, నితిన్ ల రొమాన్స్ కు సంబంధించి ఈ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీష్మ’ సినిమా లుక్సే ఇవి. దీపావళి సందర్భంగా వీటిని విడుదల చేశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. భీష్మతోపాటు నితిన్ మరో సినిమా ‘రంగ్ దే’కు కూడా శ్రీకారం చుట్టాడు. ఇందులో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

Next Story
Share it