Telugu Gateway
Cinema

బండ్ల గణేష్ పై కేసు..పరారీలో నిందితుడు

బండ్ల గణేష్ పై కేసు..పరారీలో నిందితుడు
X

ఇద్దరు సినిమా నిర్మాతల వ్యవహారం రచ్చకెక్కింది. వాళ్ళిద్దరూ పొట్లూరి వరప్రసాద్, బండ్ల గణేష్. శుక్రవారం రాత్రి బండ్ల గణేణ్ తన అనుచరులతో వచ్చి తనను బెదిరించారని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘టెంపర్‌’ చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రానికి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్‌ చేశారు. గత కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి దాటాక కొంతమంది వ్యక్తులతో కలిసి పీవీపీ నివాసంపై బండ్ల గణేష్‌ మనుషులు బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీనిపై పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 448, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ పరారీలో ఉన్నాడు.

Next Story
Share it