బాలయ్య దసరా లుక్ చూశారా?
BY Telugu Gateway7 Oct 2019 11:53 AM GMT
X
Telugu Gateway7 Oct 2019 11:53 AM GMT
దసరా పండగ అంటే ఆ సందడి వేరు. ప్రతి పండగకూ లైన్ లో ఉన్న సినిమాలు అన్నీ ఏదో ఒక కార్యక్రమంతో తమ సినిమాలకు ప్రచారం కల్పించుకుంటాయి. ఇప్పుడు పలు సినిమాలో అదే బాటలో ఉన్నాయి. ఆ జాబితాలో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. ఆయన నటిస్తున్న 105వ సినిమాకు సంబంధించిన కొత్త లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దసరా పండగ అంతా ఆయనపైనే సాగుతున్నట్లు ఉంది ఆ లుక్.
ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ 105వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చేతిలో రక్తపు కత్తి, ఒంటి నిండా పసుపుకుంకుమతో బాలయ్య కన్పిస్తున్నారు. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తోంది. భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది.
Next Story