రివర్స్ టెండర్లపై అమిత్ షా అభినందనలు!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీ సర్కారు తలపెట్టిన ‘రివర్స్ టెండర్ల’పై అభినందనలు తెలిపారా?. అంటే ఔననే చెబుతోంది వైసీపీ. కేంద్ర జలవనరుల శాఖ మాత్రం తొలుత ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. తాజాగా వైసీపీ ఇప్పుడు రివర్స్ టెండర్లకు అమిత్ షా అభినందనలు తెలిపారని..ఇలాగే ముందుకెళ్లాలంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతోంది. రివర్స్ టెండర్ల ద్వారా 838 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదాపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
మంగళవారం నాడు అమిత్ షా పుట్టిన రోజు కావటంతో కేంద్ర మంత్రులు, అధికారులు తరలివచ్చినా సీఎం జగన్‌తో అమిత్‌షా 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఏపీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఈ సందర్భంగా అమిత్‌షా భరోసా ఇచ్చారని, ఏపీ సమస్యలపై తాను ఇతర శాఖల మంత్రులతో మాట్లాడతానని అమిత్‌షా హామీనిచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు.