‘బ్లెస్సింగ్’కు భూమి పూజ చేసిన అల్లు అర్జున్
BY Telugu Gateway3 Oct 2019 3:17 PM GMT
X
Telugu Gateway3 Oct 2019 3:17 PM GMT
అల్లు అర్జున్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు కొత్తగా ఇంటి వాడు కావటం ఏంటి అనుకుంటున్నారా?. అసలు విషయం ఏమిటంటే దసరా పండగకు ముందు ప్రస్తుతం మంచి రోజులు కావటంతో ఆయన కొత్త ఇంటికి భూమి పూజ చేశారు. కుటుంబ సభ్యులతో కలసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఇంటికి ‘బ్లెస్సింగ్’ అని పేరు పెట్టారు.
ఈ విషయాలను ఈ స్టైలిష్ స్టార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నారు. అయినా కూడా చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహరెడ్డి సినిమాను కుటుంట సభ్యులతో కలసి ఎఎంబీ థియేటర్ లో వీక్షించారు.
Next Story