వెరైటీగా విజయ్ కొత్త సినిమా టైటిల్
BY Telugu Gateway17 Sept 2019 7:44 PM IST
X
Telugu Gateway17 Sept 2019 7:44 PM IST
విజయ్ దేవరకొండ. యూత్ హీరో. ఆయన సినిమా అంటే చాలు అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే తాజాగా విడుదలైన ‘డియర్ కామ్రెడ్’ మాత్రం నిరాశపర్చింది. తాజాగా ఆయన ఓ సినిమాలో నలుగురు భామలతోకలసి సందడి చేయనున్నారు. ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లె లైట్ ఉన్నారు. ఈ సినిమాకు వెరైటీ టైటిల్ ను ఖరారు చేశారు. అదేంటి అంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అట.
చిత్ర యూనిట్ అధికారికంగా టైటిల్ పేరును వెల్లడించింది. అంతే కాదు సినిమా ఫస్ట్ లుక్ ను కూడా సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయటానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. దీనికి ‘ఫైటర్’ అనే పేరును కూడా ఖరారు చేశారు.
Next Story