Telugu Gateway
Telangana

విరించి గ్రూపు నుంచి కార్డులెస్ ‘క్రిడెట్ కార్డు’

విరించి గ్రూపు నుంచి కార్డులెస్ ‘క్రిడెట్ కార్డు’
X

ఆ కార్డు క్రెడిట్ కార్డు అందించే అన్ని సేవలు అందిస్తుంది. కానీ ఆ కార్డు ఎక్కడా కన్పించదు. కానీ సేవలు మాత్రం అన్ని ఉంటాయి. అయితే మొబైల్ యాప్ ద్వారానే ఈ సేవలు అందించనుంది. అదే ‘ వి కార్డు’. విరించి లిమిటెడ్ నుంచి ఈ కార్డు అందుబాటులోకి వస్తోంది. దేశంలోనే తొలిసారి యూనిఫైడ్ పేమేంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ఆదారిత క్రెడిట్ కార్డును తాము అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, వీకార్డు సీఈవో విశాల్ రంజన్ చెబుతున్నారు. ఇది పేపర్ లెస్ క్రెడిట్ కార్డుగా నిలవనుంది. ఫోన్లలో ఎలాంటి సంప్రదింపులు చేయాల్సిన అవసరం లేకుండా చాట్ ఆధారిత సేవలు అందించనుంది.

వినియోగదారులు తమ సందేహాలు..ఇతర సమాచారం ఏమైనా కావాలనుకుంటే చాట్ ద్వారానే నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో క్రెడిట్ కార్డు ఇవ్వాలంటే బ్యాంక్ లు సవాలక్ష షరతులు పెడతాయి....లెక్కకు మించి డాక్యుమెంట్స్ అడుగుతాయి...అదికూడా వేలల్లో జీతాలు, లక్షల వ్యాపార లావాధివీలు ఉంటేనే క్రెడిట్ కార్డు జారీ చేస్తారు. అంతే కాకుండా క్రెడిట్ స్కోర్ 800 పై చిలుకు ఉంటే అప్పుడు బ్యాంక్ లు క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి ముందుకొస్తాయి. అయితే ఇవేమి లేకుండా మీ సంపాధన ఎంత తక్కువైన మీకు రుణం అందించడానికి ముందుకొస్తే ఎలా ఉంటుంది? అలాంటి సేవలే అందించడానికి ముందుకొచ్చింది వీ కార్డు .

ఆర్ బీ ఎల్ బ్యాంక్ తో టై ఆఫ్ పెట్టుకొని సామాన్యులకు క్రెడిట్ సేవలు అందించడమే ప్రధాన ద్యేయంగా బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెడుతొంది వీకార్డు. కనీస సంపాదన ఉన్న వ్యక్తులకు యాప్ ద్వారా రుణాలు మంజూరు చేస్తారు....ఆ రుణాన్ని మనం అన్ని అవసరాలకు వాడుకోవచ్చు. 30 రోజుల తరువాత వాడుకున్న మొత్తన్ని కట్టేస్తే సరిపోతుంది. వీకార్డు యాస్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీ వివరాలు పొందుపరిస్తే మీకు ఎంత వరకు రుణం మంజూరు చేస్తారు 2 నిమిషాల్లో చెప్పేస్తారు ఆ మొత్తం మీ యాప్ లో యాడ్ అవుతుంది దాన్ని మీరు సాదారణ కార్డు లాగే అన్ని అవసరాలకు వాడుకోవచ్చు అన్నారు వీకార్డు సీఈఓ విశాల్ రాజన్. హైదరాబాద్ లో జరిగిన వీకార్డు లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం 44 నగరాల్లో తమ సేవలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పట్టణాల్లో మా సేవలు అందిస్తామన్నారు...దేశంలో తొలిసారిగా కార్డు లెస్ క్రెడిట్ కార్డును తమ సంస్థ అందజేస్తోందిని తెలిపారు విశాల్ రాజన్.

Next Story
Share it