టీఆర్ఎస్ హుజూర్ నగర్ అభ్యర్ధి సైదిరెడ్డి

కాంగ్రెస్ లో ఓ వైపు కన్ఫ్యూజన్ కొనసాగుతుండగా..అధికార టీఆర్ఎస్ మాత్రం దూకుడు మీద ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన గంటల వ్యవధిలోనే తమ హుజూర్ నగర్ అభ్యర్ధి శానంరెడ్డి సైదిరెడ్డి అని ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలుపొందటంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే.
ఓ వైపు ఉత్తమ్ ఇక్కడ నుంచి తన భార్య పద్మావతి బరిలో నిలుస్తారని చెబుతుంటే..కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం మరో పేరును ప్రతిపాదిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతోంది. సీఎం కెసీఆర్ శనివారం నాడు పార్టీ నేతలతో సమావేశం అయి అభ్యర్ధిపై నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.