సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
BY Telugu Gateway17 Sep 2019 10:20 AM GMT

X
Telugu Gateway17 Sep 2019 10:20 AM GMT
హైదరాబాద్ లో ఈ బుధవారం నాడు జరగాల్సిన ‘సైరా నరసింహరెడ్డి’ ప్రీ రిలీజ్ కార్యక్రమం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే సైరా ట్రైలర్ ను మాత్రం ముందుగా ప్రకటించినట్లుగానే బుధవారం నాడు విడుదల చేయనున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు చేశారు. అయితే ఇది సెప్టెంబర్ 22కి వాయిదా పడింది.
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సైరా నరసింహరెడ్డి సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 22న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వి వి వినాయక్ లు హాజరు కానున్నారు.
Next Story