Telugu Gateway
Cinema

సాహో వసూళ్ళు 350 కోట్లు

సాహో వసూళ్ళు 350 కోట్లు
X

బడ్జెట్ 350 కోట్లు. ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్త గ్రాస్ వసూళ్ళు 350 కోట్లు. ఇదీ సాహో రికార్డు. ఈ ఏడాది భారత్ లో బ్లాక్ బస్టర్ వసూళ్ళు సాధించిన చిత్రంగా సాహో నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విచిత్రం ఏమింటే సాహో సినిమాపై సమీక్షకుల దగ్గర నుంచి మొదలుకుని ఎక్కువ మంది ప్రేక్షకుల నుంచి కూడా ప్రతికూల స్పందనే వచ్చింది. అయినా సరే సినిమా వసూళ్ళు దుమ్మురేపుతుండటం విశేషం. వరస సెలవులు ఒకటి..ఎక్కువ థియేటర్లలో విడుదల..మరో సినిమా ఏమీ లేకపోవటంతో ప్రేక్షకులు సాహో వైపు మొగ్గుచూపారు. దీనికి తోడు సినిమాపై హైప్ కూడా ఓ రేంజ్ లో పెంచేశారు. కానీ పెంచిన హైప్ ప్రకారం చూస్తే సినిమా భారీ నిరాశను మిగిల్చింది.

విదేశాల్లో యాక్షన్ సీన్లను అద్భుతంగా తెరకెక్కించినా కథపరంగా..పాటల పరంగా సినిమాలో చెప్పుకోవటానికి ఏమీ లేకపోవటం పెద్ద మైనస్ . అయినా సరే సినిమా వసూళ్ళు ఆశాజనకంగా ఉండటంతో ప్రభాస్ అభిమానులు మాత్రం కుషీకుషీగా ఉన్నారు. బాహుబలి రెండు భాగాల తర్వాత ప్రభాస్ చేసిన తొలి సినిమా ఇదే కావటంతో ప్రేక్షకుల్లో కూడా సాహోపై భారీ ఆశలే ఉన్నాయి. ఏది ఏమైనా వసూళ్ళు ఆశాజనకంగా ఉండటంతో చిత్ర యూనిట్ మాత్రం హ్యాపీహ్యాపీ.

Next Story
Share it