Telugu Gateway
Cinema

రాజకుమారిగా పూజాహెగ్డె

రాజకుమారిగా పూజాహెగ్డె
X

పూజా హెగ్డె. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. అగ్ర హీరోలు అందరితో వరస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. హిట్..ఫట్ తో సంబంధం లేకుండా ఈ భామ మాత్రం ఆఫర్లు దక్కించుకుంటోంది. టాలీవుడ్ తో బాలీవుడ్ లోనూ అప్పుడప్పుడు అలా మెరుస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ లో రాజకుమారి పాత్రలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ సినిమాలో పూజా రెండు పాత్రలు పోషిస్తుండటం విశేషం. బాలీవుడ్‌ మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ మూవీ సిరీస్‌ హౌజ్‌ఫుల్‌. ఇప్పటికే ఈ సిరీస్‌లో విడుదలైన మూడు సినిమాలు ఘన విజయాలు సాధించగా తాజాగా మరో సీక్వెల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. గత చిత్రాలతో పోలిస్తే ఈసినిమాను మరింత భారీగా ప్లాన్ చేశారు చిత్రయూనిట్‌.

ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా సమాచారం. ఇందులోనే పూజా హెగ్డే రాజకుమారి మాల, పూజ అనే రెండు పాత్రల్లో కనిపించనుంది. 15 శతాబ్దపు రాజకుమారికిగా రాయల్‌ లుక్‌తో పాటు 21వ శతాబ్దంలోని మోడ్రన్‌ అమ్మాయిగా మరో లుక్‌లో కనిపించనుంది పూజ. బుధవారం సినిమాలో పాత్రలను పరిచయం చేస్తూ వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. అక్షయ్‌ కుమార్‌, రితేష్ దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్‌, క్రితి సనన్‌, కృతి కర్బందా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story
Share it