Telugu Gateway
Cinema

సెలబ్రిటీల ‘ బెడ్ టైం స్టోరీస్ ’తో మంచు లక్ష్మీ షో

సెలబ్రిటీల ‘ బెడ్ టైం స్టోరీస్ ’తో మంచు లక్ష్మీ షో
X

సెలబ్రిటీలు ఏమి చేసినా వార్తే. వాళ్ళ ఎక్సర్ సైజ్ లు...డైట్..వాళ్ళ హాలిడే ప్రతిదీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ సబ్జెక్ట్ గా మారుతుంది. అలాంటిది సెలబ్రిటీలు రాత్రి వేళల్లో ఏమి చేస్తారు..ఎలా ఉంటారు అన్న అంశాలతో ప్రముఖ నటి, టీవీ షోల వ్యాఖ్యాత మంచు లక్ష్మీ ఓ షో చేయనుంది. దీనికి సెలబ్రిటీల ‘బెడ్ టైమ్ షో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా తారలకు సంబంధించిన డే టైమ్‌ ముచ్చట్లు అందరికీ తెలిసిపోతాయి. కానీ సెలబ్రిటీస్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది.. వాళ్లు బెడ్ పైకి చేరిన తర్వాత వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది.. ఆ రోజంతా వారికి ఎలా గడిచింది.. ఇలాంటి అంశాలతో పాటు.. ఇప్పటివరకూ ఎవరికీ చెప్పని, తెలియని విషయాలను కూడా తెలసుకోవాలనుకునే ఆసక్తి సహజంగానే ఉంటుంది. అలాంటి వారికోసం బాలీవుడ్‌లో ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అంటూ ఓ షో వస్తోంది. కాస్త ఫన్, క్రేజీ, ఇంకాస్త హాట్‌గా ఉండే ఎన్నో విషయాలను ఫిల్మ్‌ స్టార్లు ఈ కార్యక్రమంలో షేర్‌ చేసుకుంటుంటారు. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి స్పైసీ షో రాబోతోంది. మంచు లక్ష్మి హోస్ట్‌ గా వ్యవహరించనున్న ఈ షో త్వరలోనే తెలుగులో ప్రసారం కాబోతోంది. సింపుల్ గా చెబితే వీటిని ‘బెడ్ టైమ్ స్టోరీస్’అనుకోవచ్చు.

లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూ అని కూడా అనుకోవచ్చు అంటున్నారు నిర్వాహకులు. మంచు లక్ష్మి హోస్ట్‌ గా వయాకామ్ 18 ఈ షోను నిర్వహించనుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘ఫీట్ అప్ విత్ స్టార్స్ తెలుగు వెర్షన్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతున్నాను. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ భావాలను, రహస్యాలను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. అభిమాన తారలను ఫ్యాన్స్‌ కు దగ్గరగా చేస్తూ వినోదాత్మకంగా సాగి పోయే విధంగా షోను నడిపించేందుకు ప్రయత్నిస్తాను. సెలబ్రిటీల్లో నాకు ఎంతో మంది స్నేహితులు కూడా ఉన్నారు.. వాళ్లందరితోనూ చేసే సంభాషణల కోసం ప్రేక్షకులతో పాటు నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నాతో పాటు.. సెలబ్రిటీలకు కూడా ఇదో సరికొత్త అనుభవంగా మారబోతోంది’’ అన్నారు. త్వరలో ప్రారంభం కాబోతోన్న ఈ షో కోసం ఇప్పటికే చాలామందికి నచ్చే తారలతో ఇంటర్వ్యూలు సిద్ధంగా ఉన్నాయని.. ఇలాంటి సెన్సేషనల్ షో కోసం అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నామని వయాకామ్ 18 ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు. మరి మంచు లక్ష్మీ ఈ షోతో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it