Telugu Gateway
Politics

ప్రజల నడ్డివిరిచే ఆ చట్టం మాకొద్దు

ప్రజల నడ్డివిరిచే ఆ చట్టం మాకొద్దు
X

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నూతన వాహన చట్టం తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. కేంద్రం కూడా ఈ చట్టం అమలు విషయంలో పూర్తి నిర్ణయాధికారం రాష్ట్రాలదే అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కొత్త వాహన చట్టంలో పెంచిన చలాన్ల ఫీజులపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఓ వైపు ఏ మాత్రం సరైన మౌలికసదుపాయాలు కల్పించకుండా..గుంటలతో రోడ్లను పెట్టి ప్రజల నడ్డి విరుస్తారా? అంటూ కేంద్రంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో కొత్త మోటారు వాహన చట్టాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ చట్టం ఎంతో కఠినంగా ఉందని.. సామాన్యుల తాట తీసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. అంతేకాక ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయడం లేదని మమతా స్పష్టం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ చట్టాన్ని మేం పార్లమెంటులోనే వ్యతిరేకించాం. ఈ చట్టాన్ని అమలు చేస్తే.. సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ధనార్జనే ప్రభుత్వ లక్ష్యం కాకూడదు. కొన్ని సందర్భాల్లో సమస్యను మానవతా దృక్పథంలో కూడా చూడాలి. ప్రస్తుతం మా రాష్ట్రంలో ‘సేఫ్‌ డ్రైవ్‌-సేవ్‌ లైఫ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో యాక్సిడెంట్ల సంఖ్య తగ్గింద’ని తెలిపారు.

Next Story
Share it