కార్తికేయ 90ఎంఎల్ టీజర్ విడుదల
‘నా కడుపున దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలి. కాళిదాసు లాంటి ఓ రైటర్ పుట్టాలని కోరుకో. ఏసుదాసు లాంటి ఓ సింగర్ పుట్టాలని కోరుకో. కానీ దేవదాసు లాంటి ఓ డ్రింకరూ....’ అంటూ మొదలయ్యే డైలాగ్ తో హీరో కార్తికేయ 90 ఎంఎల్ సినిమా టీజర్ శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది. ‘డీజిల్ తో నడిచే బండ్లను చూసుంటావు.
పెట్రోల్ తో నడిచే బండ్లను చూసుకుంటావు. ఇది లిక్కర్ తో నడిచే బండి. కొడితే అడ్రస్ కూడా దొరకదు అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలుస్తుంది. డాక్టర్ 90నే తాగమన్నాడు అంటూ కార్తికేయ ఆలీకి చెప్పే సన్నివేశం కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాకు శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, అజయ్, పోసాని మురళీకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
https://www.youtube.com/watch?time_continue=63&v=MnGilt-w_JI