Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ విదేశీ షెడ్యూల్ పూర్తి!

ఎన్టీఆర్ విదేశీ షెడ్యూల్ పూర్తి!
X

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుంటే..రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. వీళ్ళిద్దరూ యువకులు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు...ఏమి చేసేవారు అన్న స్టోరీ లైన్ తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హీరోల గాయాలతో కొంత కాలం నత్తనడకగా సాగిన షూటింగ్ ప్రస్తుతం జోష్ లో సాగుతోంది.

ఎన్టీఆర్ ఇప్పటికే బల్గేరియాలో షూటింగ్ ముగించుకుని వెనక్కి వచ్చేశారు. త్వరలోనే హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన నటించే హీరోయిన్‌ను ఫైనలైజ్‌ చేయాల్సి ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

Next Story
Share it