Top
Telugu Gateway

జగన్ సీరియస్

జగన్ సీరియస్
X

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ బోటుకు అనుమతులు ఉన్నాయా?. వరద ఉధృతి ఉన్న సమయంలో ఎవరు అనుమతి ఇచ్చారు. దీనికి బాధ్యులు ఎవరో తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు వెంటనే సహాయ చర్యలు అందించేందుకు మంత్రులను సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. ఈ ఘటనలో పర్యాటకులు కొంత మంది మరణించిన ఘటనపై ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని..వారికి సాయం చేస్తామని తెలిపారు. గోదావరి లో తిరిగే అన్ని బోట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించాలని జగన్ ఆదేశించారు.

Next Story
Share it