Telugu Gateway
Cinema

నేను సేఫ్ అంటున్న నాని

నేను సేఫ్ అంటున్న నాని
X

హీరో నాని ‘గ్యాంగ్ లీడర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇఫ్పటికే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఈ హీరో తాను మరో 11 సంవత్సరాలు సేఫ్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా వైజాగ్ లో జరిగిన గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్ కార్యక్రమంలో మాట్లాడుతూ నాని ఈ వ్యాఖ్యలు చేశారు. విక్రమ్ కె కుమార్ తో కలసి పనిచేయాలన్న తన కోరిక ఇన్ని రోజులకు తీరిందని అన్నారు. భవిష్యత్ లోనూ ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుంటున్నానని తెలిపారు.

గ్యాంగ్ లీడర్ కు రచయిత వెంకట్ అద్భుతమైన కథ అందించారు. సినిమాలో అందరూ పడిపడి నవ్వుతారు. నాది గ్యారంటీ. తొలిసారి పరిచయం అవుతున్న హీరోయిన్ ప్రియాంకపై కూడా నాని ప్రశంసల వర్షం కురిపించారు. తొలి సినిమాలో ఎంతో బాగా చేసిందన్నారు. తెలుగు సినిమాకు కార్తికేయ రూపంలో మంచి నటుడు దొరికాడన్నాడు నాని. ఈ సినిమాలో కార్తికేయ విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it