నాని@11 సంవత్సరాలు
BY Telugu Gateway5 Sept 2019 1:12 PM IST
X
Telugu Gateway5 Sept 2019 1:12 PM IST
న్యాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇఛ్చి పదకొండు సంవత్సరాలు అయిపోయింది. ఈ విషయాన్ని ఈ హీరోనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. నాని హీరోగా తెరకెక్కిన తొలి సినిమా అష్టా చమ్మా విడుదల అయి సెప్టెంబర్ 5కి పదకొండేళ్లు. ఈ సందర్భంగా నాని తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘అష్టా - చమ్మా రిలీజ్ అయ్యి పదకొండేళ్ళు.... నా నుండి మీ అయ్యి పదకొండేళ్ళు.
ఇంత పెద్ద కుటుంబానికి థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం. మరిన్ని సంవత్సరాల పాటు ఈ అనుబంధం కొనసాగాలని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
Next Story