Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

గోదావరిలో పెను విషాదం

0

ఆదివారం..అంతా హుషారుగా గోదావరిలో ప్రయాణం. విహారం కాస్తా విషాదం అయింది. పాపికొండల పర్యాటక యాత్రకు వెళ్లిన వారిలో చాలా మంది మృత్యువాతకు గురయ్యారు. గోదవరి వరది ఉదృతికి బోటు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిలో  వరద ఎక్కువగా ఉన్నా ప్రమాదకరమైన ఈ మార్గంలో బోటుకు అనుమతి ఇచ్చి అధికారులు తప్పు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయమే ప్రమాదం చోటుచేసుకున్నా ఈ దుర్ఘటన సమాచారం కాస్త ఆలశ్యంగా బయటకు వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటులో ప్రయాణిస్తున్నవారంతా ఎక్కువమంది తెలంగాణకు చెందినవారిగా చెబుతున్నారు. హైదరాబాద్‌ నుంచి 22మంది, వరంగల్‌ నుంచి 14మంది పాపికొండలు విహార యాత్రకు బయల్దేరి వెళ్లారు.  ​ ఈ ప్రమాదం నుంచి వరంగల్‌ కాజీపేటకు చెందిన గొర్రె ప్రభాకర్‌ సహా పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారికి వైద్య సహాయం అందిస్తున్నారు.

- Advertisement -

ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ట్రాక్టర్‌లో దేవీపట్నానికి తరలిస్తున్నారు. ఇక గల్లంతు అయినవారిలో 27మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఈ దుర్ఘటనలో బోటు డ్రైవర్లు సంగాడి నూకరాజు, తామరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై లాంచీ యజమాని వెంకట రమణ మాట్లాడుతూ… కచులూరు వద్ద  పెద్ద సుడిగుండం ఉందని , దాన్ని దాటే సమయంలో డ్రైవర్లు సరిగా హ్యాండిల్‌ చేయలేకపోయారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు ఆదివారం ఉదయం మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ బోటులో ఉన్న వారి సంఖ్య విషయంలో ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెబుతున్నారు. మొత్తం 77 మంది ఈ బోటులో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే బోటు యాజమాని మాత్రం సామర్ధ్యం కంటే చాలా తక్కువ మంది ప్రయాణికులతోనే బోటు వెళ్ళిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.