Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

హిమాచల్ గవర్నర్ గా దత్రాత్రేయ ప్రమాణస్వీకారం

0

దత్తాత్రేయ గవర్నర్ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం నాడు  హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రామ సుబ్రహ్మణ్యన్ ఆయనచే బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు.

- Advertisement -

హిమాలయ సంప్రదాయ టోపీ దరించి ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం సింగ్ ఠాకూర్ తోపాటు  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్,  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి డికె అరుణతో సహా పలువురు బీజేపీ నేతలు, దత్తాత్రేయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.